మైసిగండి ఆలయ హుండీ ఆదాయం రూ. 8,94,822

by Aamani |
మైసిగండి ఆలయ హుండీ ఆదాయం రూ. 8,94,822
X

దిశ,ఆమనగల్లు( కడ్తాల్): కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయంలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ట్రస్ట్ రమావత్ శిరోలీ పంత్, ఈవో స్నేహలత, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శేఖర్ సమక్షంలో హుండీ లెక్కించారు.60 రోజులకు గాను రూ. 8,94,822 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో స్నేహలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పి భాస్కర్, అరుణ్, యాదగిరి, కృష్ణ, చంద్రయ్య, రాములు, శ్రీనివాస్, విజయ్, మహేష్, శ్రవణ్, పత్య, రవీందర్, వెంకటేష్, గోపాల్, హన్మంత్ కెనరా బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed