మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి

by Vinod kumar |   ( Updated:2023-11-14 17:22:52.0  )
మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి
X

దిశ, మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్లేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒకటే అని.. సీఎం కేసీఆర్ మాఫియాను వదిలి పెట్టామని, అవినీతిని కక్కించే వరకు వదిలిపెట్టమన్నారు. మజ్లిస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీ పార్టీకే ఉందన్నారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మజ్లిస్ పార్టీకి రాసి ఇచ్చిందన్నారు. గిరిజనుల భూములను సీఎం కేసీఆర్ లాక్కుంటున్నాడన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎంఐఎం ఆరాచకలు పోవాలంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రావాలన్నారు. పచ్చని పంట పొలాలను నాశనం చేయడానికి ఫార్మసీటి తెచ్చారన్నారు. స్థానికంగా ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకుండా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంఐఎం నాయకులకు వత్తాసు పలికి ఎంఐఎం కార్యకర్తలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టబెట్టారన్నారు.

అధికారంలోకి రాగానే స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండే అందెల శ్రీరాములు యాదవ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్, వీరందేర్ గౌడ్, పాపయ్య గౌడ్, బొక్క నర్సింహ రెడ్డి, కడారీ జంగయ్య యాదవ్, మిద్దె సుదర్శన్ రెడ్డి, దేష్యా నాయక్, యాదిష్, మోహన్ నాయక్, పోతర్ల సుదర్శన్ యాదవ్, మాధవచారి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed