- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు ఇబ్బందులు కలకుండా చూసుకోవాలి
దిశ, మొయినాబాద్ : విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూలును ఆయన సందర్శించారు. వంటగదిని పరిశీలించి శుభ్రత పట్ల తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండడానికి శుభ్రత పాటించాలని ఆయన తెలిపారు.
విద్యార్థులకు రుచికరమైన వంటలు అందజేయాలని ఆయన అన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్తగా వచ్చిన నీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాబాద్ దర్శన్, మండల అధ్యక్షుడు మానేయ్య, సహకార సంఘం చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్ రెడ్డి, కేబుల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- MLA Kale Yadayah