- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు !
దిశ, గండిపేట్: నార్సింగి మున్సిపాలిటీ పాలకవర్గం సారథ్యంలో అభివృద్ధిలో పురోగమిస్తుందని ప్రజలు ఆశిస్తున్నా, ప్రజలను ప్రజా ప్రతినిధులు నిలువునా మోసగిస్తున్నారు. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఇక మనకేంటి మనం గీసిందే గీత.. రాసిందే రాత.. అనేలా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. అభివృద్ధిని విస్తృత పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కానీ ఆ లక్ష్యం నార్సింగి మున్సిపాలిటీలో నెరవేరడం లేదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉండడంతో స్థానికంగా 9వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
అయినా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధుల్లో, అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. ఇంకా అక్రమ నిర్మాణ దారులకు అండగా నిలుస్తూ వారికి పూర్తి సహకారాలు ఇస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నిర్మాణాల వెనుక స్థానిక ప్రజాప్రతినిధులు ఉండి నడిపిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వార్తా పత్రికల్లో కథనాలు వస్తే అధికారులు మాత్రం అక్కడికి వెళ్లి వాటికి హెచ్ఎండీఏ పర్మిషన్ ఉంది అంటూ వెను తిరుగుతున్నారు. అక్కడ వాస్తవానికి 250 నుంచి 300 గజాలలో నిర్మాణాలు చేపడుతున్నారు.
మున్సిపల్ అనుమతులు మాత్రం జీ-ప్లస్ టు ఉండాల్సి ఉండగా కానీ నిర్మాణాలు మాత్రం ఇంకో తీరుగా నిర్మిస్తున్న అధికారులు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ హెచ్ఎండీఏ అధికారులు, ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు రారు..? చర్యలు తీసుకోరు వాటిపైన విచారణ చేపట్టారు. దీనిపై తీవ్రంగా ప్రజల నుంచి వ్యతిరేకత అర్థమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణాలపై ఉదాసీనత మానుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధుల అండదండలు.?
నార్సింగి మున్సిపాలిటీలో ప్రజా ప్రతినిధుల అండదండలతో జోరుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్ పాలకవర్గంలో కొందరు స్వలాభం కోసం అక్రమ నిర్మాణాలకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రతిపక్షాల నాయకులు కూడా ఈ అంశంపై నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
కింది స్థాయి అధికారుల సూచనలు మేరకే పెయింటింగా..?
మున్సిపల్‌లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు ఎక్కడ చర్యలు తీసుకుంటారు అని కింది స్థాయి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నిర్మాణాలను తొందరగా పూర్తి చేసుకొని వాటికి బయటి నుంచి వైట్ పెయింట్ వేయాలని సూచనలు కూడా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వ ఆదాయానికి గండి..?
మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కారణంగా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతుంది. సాక్షాత్తు పాలకవర్గ సభ్యులే ఈ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తుండగా అనుమతులు, వాటి కోసం చెల్లించాల్సిన డబ్బు మున్సిపాలిటీ ఆదాయానికి సమకూర్చడం లేదు. దీంతో మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతుంది. ప్రభుత్వ ఆదాయానికి ఎసరు పెట్టడంపై ప్రజలు కూడా ప్రజా ప్రతినిధులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.