- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు.. మామూళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలకు తావిస్తోంది. నగర శివారులోని ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందడంతో పాటు అక్రమ నిర్మాణాలు సైతం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అధికారుల నుంచి తీసుకున్న అనుమతులు, చేపట్టే నిర్మాణాలకు పొంతన లేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మౌనం పాటిస్తుండటంతో వారి జేబులు నిండి ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల అక్రమ నిర్మాణాలు గుర్తించిన కొందరు అధికారులు వాటిని కూల్చివేశారు. అయితే కూల్చివేతలు చేపట్టిన చోట కొద్ది రోజులకే మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు.
దిశ, గండిపేట్: నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతే ఉండటం లేదు. ఈ నిర్మాణాలపై దృష్టి సారించే నాథుడే కరువయ్యాడు. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంలో శివారు ప్రాంతమైన మణి కొండ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో మున్సిపాలిటీ మీద అక్రమ నిర్మాణాల నీడ పడింది. అడ్డు చెప్పాల్సిన అధికారులు మౌనంగా ఉంటున్నారు. ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్రమ నిర్మాణదారులు రోజు రోజుకూ పెరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా తీసుకున్న అనుమతులకు, చేపట్టే నిర్మాణాలకు పొంతన కుదరడం లేదు. అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టకపోవడం, బహుళ అంతస్తులు, సెల్లార్ల నిర్మాణం, సెట్ బ్యాక్ లు లేకపోవడం ఇలాంటి ఎన్నో అవకతవకలు ఆయా నిర్మాణాల్లో కనిపిస్తున్నాయి. ఇరవై రోజుల క్రితమే అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. కానీ స్థానికంగా ప్రజల నుంచి విమర్శలు మరో రకంగా ఉన్నాయి అధికారులకు అక్రమ నిర్మాణ దారులకు మధ్య ఒప్పందం ప్రకారమే నిర్మాణాలు చేస్తూ పత్రికల్లో కథనాలు వస్తే ఒప్పందాల మేరకు అక్కడక్కడా కూల్చివేతలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ తిరిగి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. శర మామూలుగానే ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించాలని ప్రజలు కోరుతున్నారు.
- Tags
- constructions