- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
1400 మంది బలిదానం చేస్తే ఓ మూర్ఖుడు రాజ్యమేలుతున్నాడు : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, పరిగి : రాష్ట్రం కోసం 1400 మంది బలిదానం చేస్తే ఓ మూర్ఖుడు రాజ్యమేలుతున్నాడని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ని ఉద్దేసించి సంచన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ ఖాన్ పేట్ గ్రామంలో 'ప్రజా గోసా– బీజేపీ భరోసా 'లో భాగంగా శక్తి కేంద్రాల కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా పరిగికి చేరుకోగానే మిట్టపరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఎగురవేశారు. భూనేటి కిరణ్ ఇంటి వద్ద తేనీటి విందు స్వీకరించారు. అక్కడి నుంచి రూఫ్ ఖాన్ పేట్ కు చేరుకున్నారు. రూప్ ఖాన్ పేట్ వద్ద ఏర్పటు చేసిన 'ప్రజా గోసా– బీజేపీ భరోసా 'లో భాగంగా శక్తి కేంద్రాల కార్నర్ సమావేశం నుద్దేశించి మాట్లాడారు. భారత దేశంలోని ప్రతి పౌరుడు బాగుండి శక్తి వంతమైన భారత దేశాన్ని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో మన ప్రధాన మోడీ ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల బతుకులను నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు.
నియంత పాలనను కొనసాగిస్తూ కేసీఆర్ ముందు ఇంకెవ్వరూ గట్టిగా మాట్లాడడొద్దని కోరుకుంటాడని చెప్పారు. ఎవరిని ఎట్లా మోసం చేయాలో ఆయనకు బాగా తెలుసని, మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబం కూడా అంతేనన్నారు. కేసీఆర్ ను వణించేంది బీజేపీ మాత్రమేనని ఫాం హౌజ్ లో ఉన్న కేసీఆర్ ను ప్రగతి భవన్ కు గుంజ కొచ్చామని, అక్కడి నుంచి రద్దు చేసిన ధర్న చౌక్ కు లాక్కొచ్చామని చురక అంటించారు. ధర్నా చౌక్ నుంచి రాష్ర్టం మొత్తం మీద పరుగులు పెట్టించింది బీజేపీయేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖేల్ కతం దుకాణ్ బంద్ అవుతుందని, సీఎం ముఖం చూసి ఎవరూ ఓట్లు వేయరన్నారు. తెలంగాణను అభివృద్ది చేయాలని మోడీ సంకల్పంతో ఉంటే సీఎం కేసీఆర్ సహకరించడం లేదన్నారు.
తెలంగాణ రాష్ర్టంలో బీఆర్ఎస్ గడీలు పగలగొట్టి త్వరలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మొదట బీఆర్ఎస్ లో చేరినప్పుడు సీఎం కేసీఆర్ తనతో మాట్లాడుతూ ప్రజా సొమ్ము ఎప్పుడూ కావాలని చెప్పగా ఎంత గొప్పవాడు అనుకున్నాము. మనం రూలింగ్ పార్టీ కాదని సర్వింగ్ పార్టీ అని మనందరం ప్రజల జీతగాల్లు అన్నడు. ఆంద్రోళ్లు దొంగలని, వారిని తరిమేయాలని మనోడు దొంగతనం చేస్తే ఇక్కడనే బొందపెట్టాలన్నారు. అందుకనే అక్కడ మోసపోయి బీజేపీ పార్టీలో చేశారన్నారు. బీజేపీ పార్టీ సిద్దాంతాలు, ఆశయ సాధన చాలా గొప్పదన్నారు. గ్రామాలు బాగు పడాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీ ఖాతాలో డబ్బులు వేస్తే ఇంకేం మన ఇంటి దొంగ ఇట్టే ఖాజేసిన వియషం ప్రతి గ్రామ సర్పంచ్ తోపాటు ప్రజలందరికీ తెలుసన్నారు.
అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ పార్టీని ఆదరించాలన్నారు. అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం ఎన్నికల సమయంలోనే పార్టీలని, అనంతరం ప్రతి గ్రామం, పౌరుడు అభివృద్ది చెందాలన్న దేశ ప్రధాని ఆకాంక్ష చాలా గొప్పదన్నారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో బూత్ స్థాయి నుంచి పార్టీ సంక్షేమ పథకాలు ప్రచారంలోకి తీసుకురావాలని సూచించారు. మనం తీనే రేషన్ మొదలు, వీధిలైట్లు , సీసీ రోడ్లు తదితరాలన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతో జరుగుతున్నాయన్న విషయం ప్రజలకు తెలియజేసి పార్టీ అభివృద్దికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షుడు గొంగడి మనోహర్ రెడ్డి, ఆకుల విజయ, నర్సింహారెడ్డి, రాష్ట నాయకులు కరుణం ప్రహ్లాద్ రావ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నర్సింహ, జిల్లా కార్యదర్శి, నాయకుల పెంటయ్యగుప్త, జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్, శక్తి కేంద్రం ఇంచార్జి శ్యాంసుందర్, మండల అధ్యక్షులు ఆంజనేయులు పాల్గొన్నారు.