- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విస్తార వర్షాలతో ప్రజల ఇక్కట్లు
దిశ, రంగారెడ్డి బ్యూరో : గత రెండు రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండి వాగులు వంకలు పొంగిపొర్లడంతో ఆయా జిల్లాలలో వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయి, సామాన్య జనం ప్రమాదాలకు గురై అక్కడక్కడా ప్రాణాలు సైతం కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య యాచారం మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, అంతకు ముందు షాద్ నగర్ లోనే ఓ వెంచర్లో నీళ్లు నిండి వెంచర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందడం జరిగింది.
గురువారం వికారాబాద్ జిల్లా, ధారూర్ మండలం, నాగారం గ్రామం దగ్గర కారుతో సహా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు భార్యాభర్తలు అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో వరదల్లో కొట్టుకుపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ పెద్దలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలలో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి..
భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలలో చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గురువారం వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ పల్లిలో 33.2 మిల్లిలీటర్ల వర్షపాతం నమోదు కాగా, శేరిలింగంపల్లిలో 34.4, గండిపేట 30.0, రాంజేంద్రనగర్ 58.1, బాలాపూర్ 15.2, సరూర్ నగర్ 35.5, హయత్ నగర్ 43.9, అబ్దుల్లాపూర్ 34.7, ఇబ్రహీంపట్నం 71.1, మంచాల 35.0, యాచారం 58.4, మాడ్గుల్ 73.5, అమంగల్ లో అత్యధికంగా 143.4, తలకొండపల్లి 76.4, కేశవంపేట 66.0, కడ్తాల్ 40.8, కందుకూరు 57.3,
మహేశ్వరం 43.2, శంషాబాద్ 21.3, మొయినాబాద్ 19.0, చేవెళ్ల 41.8, శంషాబాద్ 90.7, కొత్తూరు 64.5, నందిగామ 66.5, ఫారూక్నగర్ 52.0, కొండూర్గ్ 59.4, చౌదరిగూడ 91.8 శాతం వర్షపాతం నమోదు కాగా, జిల్లా మొత్తంగా 52.2 శాతం వర్షపాతం నమోదు అయ్యింది. ఇక వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే కొడంగల్ లో అత్యధికంగా 93.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు కాగా, మర్పల్లి 10.0, మోమిన్‌పేట్ 3.0,నవాబ్‌పేట్ 35.0, వికారాబాద్ 52.1, పూడూరు 71.5, కుల్కచర్ల 61.9, దోమ 25.8, పరిగి 74.6, దారూర్ 68.8, బంట్వారం 6.0, తాండూరు 28.8, యాలాల్ 37.6, పెద్దేముల్ 34.4, బషీరాబాద్ 17.3, బొంరాస్‌పేట్ 31.0, దౌల్తాబాద్ 30.0, చౌడాపూర్ 32.0 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
Also Read: దంచికొట్టిన వాన