పార్టీలోనే ఉంటా.. పార్టీ కోసం కష్టపడతా..

by Sumithra |
పార్టీలోనే ఉంటా.. పార్టీ కోసం కష్టపడతా..
X

దిశ, తలకొండపల్లి : కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవి చేపట్టి నేటితో సంవత్సరకాలం పూర్తయిందని తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుజ్జుల మహేష్ ప్రకటించారు. మండల కేంద్రంలోని మంగళవారం హాత్ సే హాత్ జోడో యాత్ర పై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గుజ్జుల మహేష్ మాట్లాడుతూ మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తనమీద ఎంతో నమ్మకం విశ్వాసంతో మండల అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు.

గత సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నానని, కానీ కొంతమంది అగ్రకుల నాయకులు బీసీ వర్గానికి చెందిన నన్ను అనుగదొక్కాలని కొన్ని శక్తులుపన్నాగం పన్నుతుండడంతో నేను నేటితో ఆయన అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నట్లు మనసులో మాటను మీడియా ముందుప్రకటించారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ మహేష్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. తలకొండపల్లి మండల కేంద్రంలో హాత్ సే హాత్ జోడు యాత్ర పై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే మీరు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఏమిటని మండలానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మహేష్ ను వెంటనే సముదాయించారు.

మహేష్ సున్నితంగా మాట్లాడుతూ ఆయన గత సంవత్సరం క్రితం పదవి చేపట్టి నేటితో సంవత్సరకాలం పూర్తయిందని, అనుకున్న మాట ప్రకారం ఆయన మండల అధ్యక్షపదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారని తెలిపారు. ఆయన పార్టీలోనే ఉంటానని తెలిపి పార్టీ కోసం కష్టపడతానని స్పష్టం చేశారు. గత సంవత్సర కాలంగా ఆయనకి సహకరించిన పెద్దలందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

మండలంలోని ఆయన అధ్యక్ష పదవి చేపట్టడం కొంతమంది వ్యక్తులకు ఇష్టం లేదని మహేష్ తన మనసులో మాటను మీడియా ముందు వెళ్లగక్కారు. రానున్న రెండు మూడు రోజుల తర్వాత మహేష్ పూర్తివిషయాలు మరోసారి మీడియా ముందు ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ అంజయ్య, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి మోహన్ రెడ్డి, మండల సేవాదళ్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్, మండల మైనార్టీ అధ్యక్షులు ఆరీఫ్, సోషల్ మీడియా ఇంచార్జి అజీమ్, చంద్రన్న మాజీ ఎంపీటీసీ రాములు, రాంపూర్ మాజీ ఎంపీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed