- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.కోటి 13 లక్షల విలువ చేసే బంగారం పట్టివేత
దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుండి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం దుబాయ్, కువైట్ దేశాల నుండి వేర్వేరు విమానాలలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి ముంజు ప్రసాద్ గౌడ్, అబ్దుల్ రహీం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించగా స్కానింగ్ లో బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికులు బంగారాన్ని లగేజీ బ్యాగులో దాచి తరలించే ప్రయత్నం చేశారు. ముంజు ప్రసాద్ గౌడ్ వద్ద రూ.కోటి విలువ జేసే 2 కిలోల 100 గ్రాముల బంగారాన్ని, అబ్దుల్ రహీం వద్ద రూ.13 లక్షల విలువ జేసే 268 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
- Tags
- RGIA
- shamshabad