శివ..శివ.. పండ్ల ధరలకు రెక్కలు..

by Sumithra |
శివ..శివ.. పండ్ల ధరలకు రెక్కలు..
X

దిశ, పరిగి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షచేపట్టే భక్తులకు పండ్ల ధరలు చుక్కలు చేపిస్తున్నాయి. దీక్షకోసం ప్రత్యేకంగా అవసరమయ్యే కజూర్​ కిలో 200 వందలు గరిష్ట ధర పలికింది. పండగ కోసం హైవే రోడ్డు పొడుగునా పండ్ల వ్యాపారులు టెంట్లు వేసి మరీ పండ్లు విక్రయిస్తున్నారు.

తోపుడు బండి మొదలు టెంట్లు వేసిన దుకాణాలు అన్నీకలిపితే పరిగి మున్సిపల్​ లోనే 100కు పైగానే దుకాణాలు వెలిసాయి. ఓ వైపు పండగ మరో వైపు పరిగిలో శుక్రవారం మార్కెట్​ కావడంతో జనాలతో కిటకిటలాడింది. పండ్ల వ్యాపారులకు పండగ గిరాకీ పుల్​ గా ఉండటంతో రోజు వారి రేట్ల కంటే పెంచి విక్రయించారు. అంగూర్​ కిలో 100, ఆపిల్స్​ వందకు నాలుగు, ఖర్జూజా 60 కిలో, సంత్ర కేజీ 100, అరటిపండ్లు డజనుకు 80, దానిమ్మ వందకు 5, తర్బూజ్​ ( రెడ్​ దీ ) 20 కిలో చొప్పున విక్రయించారు.

Advertisement

Next Story