- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహార పదార్థాలు తయారు చేసే కంపెనీల పై దాడులు..
దిశ, శంషాబాద్ : కల్తీఆహార పదార్థాలు తయారు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని నల్గొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ కాటేదాన్ పారిశ్రామికవాడలోని పలు తినుబండారాలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాల పై పోలీసులతో కలిసి 4 బృందాలుగా ఏర్పడి 30కిపైగా కంపెనీల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడి దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో చిన్నపిల్లలు తినే బిస్కెట్లు, తిను బండారాలతో పాటు నిత్యావసర ఆహార వస్తువులైన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మసాలా తదితర వస్తువులు అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అదేవిధంగా ఒకే అడ్రస్ పేరుతో నాలుగు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్తీ వస్తువులు తింటే ఉదర సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పరిశ్రమల పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అవసరమైతేతక్కువ బాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీకి వాడిన రసాయనాలను, వస్తువులను సీజ్ చేసి ల్యాబ్ కు తరలించారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో అడ్డదారులు తొక్కుతున్నారన్నారు.
రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. ఈ ఆహార పదార్థాలలో నిషేధిత రసాయనలను కలుపుతూ నిలువ ఉంచేందుకు వాడుతున్నారని, ఇవి వాడడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు. కాటేదాన్ లోని రవిఫుడ్ బిస్కెట్ ఫుడ్ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు అన్నారు. ప్రజల ప్రాణాలతో చేలాగాటమాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు ఈ దాడులు కొనసాగుతాయి అన్నారు.