- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎరువుల దుకాణదారులు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి
X
దిశ, నర్సాపూర్ : ఎరువుల దుకాణదారులు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని వ్యవసాయ సహాయ సంచాలకులు పుణ్యవతి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని విత్తన, ఎరువులు పురుగు మందుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి దీపికతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విత్తనాలు, ఎరువులు పురుగు మందుల నాణ్యత, విక్రయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దుకాణాల యజమానులు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఎరువులు పీఓఎస్ మిషన్ ద్వారానే విక్రయించాలని తెలిపారు. డీలర్లు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖకు రిపోర్టులు అందజేయాలని, స్టాక్ రిజిస్టర్లు రోజు వారీ అప్డేట్ చేయాలని ఆదేశించారు. విక్రయాలలో డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Next Story