- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Marpally : మర్పల్లి వ్యవసాయ మార్కెట్ పీఠంపై ఉత్కంఠ..
దిశ,మర్పల్లి: వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత వికారాబాద్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు అన్నీ కాంగ్రెస్ నేతల చేతుల్లోకి రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఎంపీ ఎన్నికల కోడ్ రావడంతో ఆశావహులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తీ లు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆశలు మరింత రేకేత్తిస్తున్నాయి.
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఇకపై తమకు దక్కాల్సిన నామినేటేడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారిస్తున్నారు. మార్కెట్ కమిటీలు, పంచాయతీ, మండల స్థాయిలో ఉండే ప్రొటోకాల్ పదవులపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అఽధికారంలో లేని పదేళ్ల కాలం పాటు కష్టకాలంలో కూడా పని చేశామని.. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నామినేటేడ్ పదవులతో తమకు న్యాయం చేయాలని పార్టీ నాయకులు పార్టీ పెద్దల వద్ద తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఎవరికి వారే ప్రయత్నాలు..
మర్ప ల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో పోస్టులు దక్కించుకునేందుకు ఎవరికి వారుగా పైరవీలు ప్రారంభించారు. కొత్తగా వచ్చిన వారికి దక్కుతుందా లేదా 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి న వారికి దక్కుతుందా అని ఉత్కంఠగా ఎదురుచుస్తున్నారు.ఈ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న ఆయా మండలాల్లోని కాంగ్రెస్ నేతలు చైర్మన్‌లు, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్‌ల యోగం ఎవరిని వరిస్తోందోనని స్థానికులు, నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.