- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ కార్యదర్శి సస్పెండ్, ముగ్గురికి ఫెనాల్టీ..
దిశ, దోమ : అభివృద్ధి పనులలో నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దోర్నాలపల్లి గ్రామాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మొదట గ్రామపంచాయతీని సందర్శించి గ్రామపంచాయతీలో పరిశుభ్రత కొరవడంతో మండిపడ్డారు. పంచాయతీ అంటే ఇళ్లల్లో చూసుకోవాలని ఇదేమిటనే అసహ్యించుకున్నారు. అక్కడి నుంచి నర్సరీలోని హరితహారం మొక్కలను పరిశీలించారు. మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయని ఇంచార్జి కార్యదర్శి సురేష్ ను ప్రశ్నించగా నీళ్లు లేవని తెలిపారు. ఇక్కడ ట్యాంకర్ తో ఉండి పోయించడం తెలియదా అంటూ అపరిశుభ్రంగా ఉన్న పల్లెప్రకృతి వనాన్ని చూసి కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ దోర్నాలపల్లి గ్రామానికి ఇంచార్జి తమ గ్రామంలో బాగున్నాయి సార్ అంటూ పేర్కొన్నారు.
అక్కడికి వెళ్దామా బాగా లేకుంటే సర్వీస్ రిమూల్ చేయాలా ? అని నిలదీయడంతో సమయం ఇవ్వండి సార్ అంటూ కార్యదర్శి కోరగా సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎండిన మొక్కలకు బాధ్యత వహించాలని ఏపీవో దస్తయ్య, సాంకేతిక సహాయకుడు నారాయణరెడ్డి, కార్యదర్శి సురేష్ లకు ముగ్గురికి రూ.10వేల చొప్పున పెనాల్టీ వేశారు. ఎంపీవో సోమలింగం విధులకు గైర్హాజరవడం మెమో జారీ చేశారు. స్మశాన వాటిక గురించి ఆరాతీయగా పొలాల వద్దనే ఖననం చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో పర్యవేక్షణ సరిగా లేక ఇలా జరుగుతుందని, పదిరోజుల్లో మళ్లీ వస్తా ప్రగతిలో మార్పు కనిపించకపోతే సస్పెండ్ చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరగతులు కలియ తిరుగుతూ.. విద్యార్థులను పలకరిస్తూ..
ప్రాథమిక పాఠశాలకు వెళ్లివిద్యార్థులను పలకరిస్తూ పాటల నుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకటో తరగతి విద్యార్థులకు ఏబీసీడీలు వస్తాయంటూ బోర్డుపై రాయించారు. విద్యార్థులందరూ ఒకేరకం దుస్తులు ధరించకపోవడం, గైర్హజరవడం పై ఉపాధ్యాయులతో ఆరాతీశారు. పుస్తకాల్లోని అంశాలే కాకుండాబేసిక్ నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్నం భోజనం, మరుగుదొడ్లను పరిశీలించి మధ్యాహ్నం భోజనం మంచిగా అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం దోమ ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాలను పరిశీలించారు. దోమలో హరితహారం మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదగలేదని పేర్కొనగా దోమసర్పంచ్ రాజిరెడ్డి కల్పించమని కోతుల బెడద అధికంగా ఉందని, దీంతో కొమ్మలను విరిచేస్తున్నాయని పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ ను కోరారు.