మత్తు పదార్థాలకు అడ్డాగా గిరిజన వసతిగృహం..

by Sumithra |
మత్తు పదార్థాలకు అడ్డాగా గిరిజన వసతిగృహం..
X

దిశ, ఆమనగల్లు : ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహ పర్యవేక్షణ లోపంతో గాడి తప్పుతున్నారు. వసతిగృహం పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారాయి. పర్యవేక్షణలోపంతో గిరిజన వసతి గృహంలో ఎక్కడ చూసినా సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు దర్శనమిస్తున్నాయి. వార్డెన్ నిర్లక్ష్యంతో హాస్టల్ సమస్యలకు నిలయంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనము అందించడం లేదు. వసతి గృహానికి సెక్యూరిటీ గార్డ్ లేక రాత్రి వేళల్లో విద్యార్థులు రోడ్లపై తిరుగుతున్నారు. విధుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న హాస్టల్ వార్డెన్ ను వెంటనే తొలగించాలని ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి క్యామ శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

మద్యం సేవించి విధులకు హాజరవుతున్న వార్డెన్..

వసతి గృహ వార్డెన్ మద్యం సేవించి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం. మద్యం మత్తులో విద్యార్థులకు ముద్దులు పెడుతున్నట్టు వారు వాపోతున్నారు. భోజనం సరిగా లేదంటే విద్యార్థులను సైతం కొడుతున్నాడని తెలుపుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వార్డెన్ పై చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

Next Story

Most Viewed