- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడంగ్పేట్ పురాతన కోటగోడ నేలమట్టం
దిశ, బడంగ్పేట్ : ఒక ప్రాచీన కట్టడాన్ని సందర్శిస్తే చారిత్రాత్మక నేపధ్యం కళ్ళముందు కదలాడుతుంది. ఎన్నో గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయమైన భారత దేశంలో పాలకుల నిర్లక్ష్యంతో అవి కాలక్రమేణ కనుమరుగవుతున్నాయి. నిర్వహణలోపంతో చారిత్రాత్మక నేపధ్యం ఉన్నప్పటికీ సరైన గుర్తింపును దక్కించుకోలేక పోతున్నాయి. వారసత్వ సంపదలను సంరక్షించుకోవాల్సిన పాలకులే భక్షకులుగా మారుతున్నారు. శతాబ్దాల ఘనచరిత్ర కలిగన బడంగ్ పేట చుట్టూ వెలసిన అద్భుతమైన కోట గోడకు పాలకులు, అధికారులు తూట్లు పొడుస్తున్నారు.
పురాతన కోటగోడకు ఆనుకుని ఉన్న రేకుళ ఇళ్ళపై శిధిలాలు పడుతున్నాయన్న కారణంతో కార్పొరేషన్ అధికారులు, నాయకులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నా చారిత్రాత్మక కట్టడాలను కాపాడాల్సిన పురావస్తు శాఖ మొద్దునిద్దర వీడడం లేదన్నవిమర్షలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సింది పోయి.. స్థలాల కోసమే చారిత్రాత్మక కట్టడాలను కూల్చివేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి. వివరాల ప్రకారం నాలుగువందల ఏళ్ళ క్రితం బడంగ్‌పేటను మామ బడంగ్ అనే రాజు పరిపాలించేవాడని కథ వినిపిస్తుంది.
దట్టమైన అడవి ప్రాంతం కావడం అప్పట్లో దొంగల భయం కూడా విపరీతంగా ఉండడమే కాకుండా శత్రువుల నుంచి కూడా పరిరక్షించడం కోసం బడంగ్ పేట గ్రామం చుట్టూర ఎత్తైన కోట గోడను శత్రు దర్బేధ్యంగా నిర్మించారు. కోట గోడ చుట్టూర నాలుగు ద్వారాలు పట్నం, నాదర్‌గూల్, దేవుని, బాలాపూర్ దర్వాజలను నిర్మించారు. వాటి గుండానే రాకపోకలను సాగించేవారు. నిగరానికి కోసం కోట లోపల ఎత్తైన బూర్జుతో పాటు రచ్చబండ (చౌడి)ని నిర్మించారు. శత్రవులను కోటలోపలికి రాకుండా దాడిచేసేందుకు ఫిరంగిని కూడా అప్పట్లో ఉండేది.
ఇప్పటికే ఫిరంగి ఆనవాళ్లు లేకుండా పోయింది. ఎంతో ఘనచరిత్ర కలిగిన బడంగ్‌పేట కోటగోడ శిథివాస్థకు చేరుకుందని, వాటి పక్కనే ఉన్న గృహనిర్మాణాలపై శిథిలాలు పడుతున్నాయన్న నెపంతో పూర్తిగా స్థానిక నాయకుల ఫిర్యాదు మేరకు బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారులే స్యయంగా నేలమట్టడం చేయడం పట్ల సర్వత్రా విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 100 ఏళ్ళ క్రితం నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలన్నీ హెరిటేజ్ కిందికి పరిగణించబడుతాయి. శిథిలావస్థకు చేరుకున్న కోటగోడలకు తుదిమెరుగులు దిద్దాల్సింది పోయి, జేసీబీతో పూర్తిగా నేలమట్టం చేయడంపట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోటగోడకు హెరిటేజ్‌కు సంబంధం లేదంటున్న: కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి
శతాబ్దాల క్రితం బడంగ్పేట్ చుట్టూర వెలసిన కోటగోడ పురావస్తుశాఖ పరిధిలో లేదని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి అంటున్నారు. పురాతన కోటగోడ కూలడానికి సిద్దంగా ఉందని, దానిపై నుంచి శిధిలాలు పక్కనే ఉన్న గృహ నిర్మాణాలపై పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా కొంత భాగమే కూల్చివేస్తున్నామన్నారు. కానీ కమిషనర్ కొంత వరకే అని చెప్పినప్పటికీ కోటగోడను జేసీబీతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఇంకా ఈ విషయమై పురావస్తు శాఖ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే?