- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగును పండగ చేసి రైతును రాజుగా చేశాడు : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
దిశ, పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయాన్ని పండగ చేసి రైతును రాజుగా సీఎం కేసీఆర్ చేశారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రంగాపూర్ శివారులోని రైతు వేధికల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా రైతులు, ఎద్దుల బండ్లలో ఊరేగింపుగా వచ్చారు. అనంతరం రైతు వేధికలో సమావేశం నిర్వహించారు. నస్కల్ గ్రామంలో రైతు బంధు మండల కన్వీనర్ మేడిద రాజేందర్ అధ్యక్షతన రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రైతు బంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాల గురించి చర్చించారు.
అలాగే చిగురాల్ పల్లి, గడిసింగాపూర్, సయ్యద్ పల్లి, రాపోల్ గ్రామాల్లోని రైతు వేధికల్లో రైతు దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచులు, రైతు సంఘాల సభ్యులు, రంగాపూర్ గ్రామంలో ఎంపీపీ కరణం అరవింద్ రావ్, చిగురాల్ పల్లిలో జడ్పీటీసీ బేతు హరిప్రియ, రాపోల్ ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, నస్కలో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.