- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరుగా ఫామ్ ల్యాండ్ దందా.. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం
దిశ, చేవెళ్ల : నగరానికి దగ్గరగా ఉన్న చేవెళ్లలో ఫామ్ ల్యాండ్ దందా నడుస్తుంది. చేవెళ్ల మండలంలోని తంగడ్ పల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 312,313,314,316 గల లలో వాయు హల్కాన్ ఇన్ఫ్రా పేరుతో వెంచర్ నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా దర్జాగా నిర్మాణం చేస్తున్నారు వెంచర్ నిర్వహకులు. వెంచర్ ను 40 ప్లాట్లు గా విభజించి రోడ్డు అండర్ డ్రైనేజీ విద్యుత్ స్థంబాలు,అండర్ విద్యుత్ లైన్ చుట్టూ ప్రహరీ గోడ కట్టి నిర్మాణం చేస్తున్నారు.
దాదాపు 20 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ప్లాట్లు ను 605 నుంచి మొదలై 3383 గజల వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత పెద్ద వెంచర్ నిర్మాణం చేస్తున్న కనీసం వ్యవసాయ భూమిని ఆర్డీవో కార్యాలయంలో వ్యవసాయేతర భూమిగా మార్చుకోలేయాపోయారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకొని గజలలో భూమి రిజిస్ట్రేషన్ విక్రయాలు జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్న అధికారులకు పట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి అయిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.