- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఉత్సవ విగ్రహాలుగా ఎంపీటీసీలు..
దిశ, నందిగామ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎంపీటీసీలు నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోవాల్సి వస్తుందని నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ ఆరోపించారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొమ్ముకృష్ణ మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితబంధు లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందుతున్నాయని ఆరోపించారు.
జిల్లా నాయకులుగా చెప్పుకునే ప్రజాప్రతినిదులు ప్రజల సంక్షేమం మరిచి ప్రజలను తీవ్రఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆ నాయకులు దమ్ముంటే తమపదవులకు రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాలని సవాల్ విసిరారు. ఇంటి పర్మిషన్ల కోసం వెళితే డబ్బులు వసూలు చేసే చరిత్ర మండల కేంద్రానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిదని అని తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెబుతారన్నారు. అధికార పార్టీ దురాగతాలను ఎండగట్టి, ప్రజాసమస్యల పై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని కొమ్ము కృష్ణ అన్నారు.