- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అయోమయంలో కాంగ్రెస్ పార్టీ..
దిశ, తలకొండపల్లి : కల్వకుర్తి నియోజకవర్గంలోని చీపునుంతల గ్రామానికి చెందిన గుజ్జుల మహేష్ గత సంవత్సరం క్రితం మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ సమయంలో నియోజకవర్గంలోనే ఎవరు ఊహించని రీతిలో సుమారు 150 నుండి 200 వాహనాలతో భారీ కాన్వాయ్ తో ర్యాలీ చేపట్టి హైదరాబాదులోని గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు. పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ బలపడాలి అనే ఉద్దేశంతో గుజ్జుల మహేష్ కు తలకొండపల్లిలో పాతిక సంవత్సరాలుగా అనుభవం ఉన్న కాంగ్రెస్ పెద్దలను కాదని, మండల పార్టీ అధ్యక్ష పదవిని అప్పచెప్పారు.
ఆనాటి నుండి నేటివరకు తలకొండపల్లి మండలంలోని గుజ్జుల మహేష్ గ్రామీణ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలపడడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేశాడని పార్టీ కార్యకర్తలు, నాయకులే ఒప్పుకుంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జోడో యాత్ర చేపట్టాలని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహేష్ మాత్రం కాంగ్రెస్లోనే ఉంటా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పుకుంటూనే కాంగ్రెస్ పెద్దలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పెద్దలు అవాక్కైన సంఘటన చోటుచేసుకుంది. మండలంలో యువకుడైన మహేష్ కాంగ్రెస్ అభివృద్ధికి అంచలంచలుగా కృషి చేశాడని, పార్టీని వీడితే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ పెద్దలు కొంతమంది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మహేష్ ను మాత్రం బీజేపీ, బీఆర్ఎస్, నాయకులు కూడా పార్టీలోకి చేర్చుకోవడానికి మంతనాలు సైతం లోలోన జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ మౌనం వెనుక మరమం ఏమిటి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉలికి పడే విధంగా గుజ్జుల మహేష్ తీసుకున్న నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని చర్చలు కొనసాగుతున్నాయి. మహేష్ కు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేదా అనే విషయం సస్పెన్స్ గా మారింది. పార్టీ అధ్యక్ష పదవి మరో ఒకరికి అప్పగిస్తే, మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా తనను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ చందు రెడ్డి మాత్రం మహేష్ ను బుజ్జగిస్తాడా, లేదా అనే విషయం మరికొన్ని రోజులు ఆగితే అసలు విషయాలు బయటకు వస్తాయని మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.