- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడల్లో గెలుపోటములు సహజం : గొల్లపల్లి కౌన్సిలర్ చెన్నం అశోక్
దిశ, శంషాబాద్ : క్రీడల్లో గెలుపోటములు సహజమని గొల్లపల్లి కౌన్సిలర్ చెన్నం అశోక్ అన్నారు. గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ 2023 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలోని క్రికెట్ గ్రౌండ్లో సోమవారం కౌన్సిలర్ చెన్నం అశోక్ టాస్ ఎగరేసి, బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నేటి నుండి తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ పోటీలలో 12 టీంలు పాల్గొంటాయి అన్నారు. క్రీడల వలన శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యం కలుగుతుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమాన దృష్టితో చూడడమే కాకుండా ఐకమత్యంగా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, నేటి ఓటమి, రేపటి విజయానికి నాంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోన్ లిఫ్టింగ్ ఛాంపియన్ మల్లికా రాఘవేందర్ గౌడ్, టీఆర్ఎస్వీ శంషాబాద్ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, 9వ వార్డు యూత్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.