- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు బురిడీ...ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పిస్తాడనుకుని డబ్బులిచ్చి రోజులు గడుస్తుండడంతో ఉద్యోగాలు రాకపోవడంతో చివరకు మోసం చేశాడని గ్రహించి ఆ వ్యక్తిని పట్టుకొని ఆర్మూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు ఆర్మూర్ పట్టణంలోని ఓ కాలేజీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా విధులు నిర్వహించే వ్యక్తి ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులను చేరదీసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి యువకులకు నమ్మబలికాడు. ఆర్మూర్ కు చెందిన ఓ ప్రధాన లీడర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆర్మూర్ కు చెందిన గోల్ బంగ్లా వద్ద ఒక యువకుడి నుంచి రెండు లక్షల నగదును వసూలు చేశాడు. ఈయనతోపాటు మరికొందరు యువకులకు సైతం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక లక్ష, 50 వేల చొప్పున, ఇంకొందరు దగ్గర అడ్వాన్సుడ్ గా 30 నుంచి 50 వేల వరకు వసూలు చేసినట్లు నిరుద్యోగ యువకులు చెబుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని నెలలు గడుస్తున్నా తమ ఉద్యోగాల జాడేది అంటూ ఆ వ్యక్తిని యువకులందరూ కలిసి నిలదీశారు. అయినా ఫలితం లేకపోయినా ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను బురెడీ కొట్టించడంతోపాటు పరీక్షల్లో సైతం పాస్ చేయిస్తానంటూ విద్యార్థుల దగ్గర నుంచి రెండు నుంచి ఐదు వేల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.