- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ 11వేల టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
దిశ, రంగారెడ్డి బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఎప్పుడో మంజూరు చేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ పదోన్నత్తులు, బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయ పదోన్నత్తులు, బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా కొంత మంది కోర్టుకేళ్లి స్టే తెచ్చారని గుర్తు చేశారు. ఈ నెల 16వ తేదీ వరకు ఏలాంటి టీచర్ల ప్రక్రియ చేపట్టోద్దని హైకోర్టు సూచించిందని తెలిపారు. ఆ తర్వాత టీచర్ల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను గుర్తించి నియామకం చేపడుతామని మంత్రి తెలిపారు.
మేడికో విద్యార్ధి ప్రీతి, ఇంటర్ విద్యార్ధి సాత్విక్ సంఘటనలు చాలా బాధకారమన్నారు. ఇలాంటి సంఘటనలు కాలేజీలల్లో జరగకుండా ఉండేందుకు కఠినతరమైన చర్యలున్నాయని, ఆ చర్యలు అమలు చేసేటట్లు ఆదేశాలు ఇస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి జూనియార్ కాలేజీ విద్యార్ధులపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ చేసేందుకు కాలేజీలల్లో కౌన్సిలింగ్ ఇచ్చే అధ్యాపకులను నియామకం ఉండాలని సూచించామన్నారు. విద్యార్థుల ఆవేదనను వ్యక్తం చేసేందుకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 14,416 కి ఫోన్కి సంప్రదించాలని సూచించారు. మీ సమస్యలను నివ్రత్తి చేసేందుకు బోర్డులో సైకాలజిస్ట్లును నియామించినట్లు తెలిపారు.