- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగారెడ్డిలో 726, వికారాబాద్ లో 74 సెంటర్లలో పదవతరగతి పరీక్షల నిర్వహణ..
దిశ ప్రతినిధి, వికారాబాద్ : రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 3వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల కోసం రంగారెడ్డి జిల్లాలో 226, వికారాబాద్ జిల్లాలో 74 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రెండు జిల్లాల విద్యాధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో 226 సెంటర్లలో 25,214 మంది బాలురు, 24,540 మంది బాలికలు కలిపి మొత్తం 49,754 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, వికారాబాద్ జిల్లాలో 74 సెంటర్లలో బాలురు 6,987, బాలికలు 6,740 మొత్తం 13727 విద్యార్థులు హాజరు కానున్నారన్నారని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకదేవి తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం12:30 గంటల వరకు పరీక్ష సమయం నిర్ణయించబడింది.
ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్సు, కాంపోజిట్ తెలుగు కోర్సు రాసే విద్యార్థులకు మరో 20 నిమిషాల సమయం అదనంగా ఇవ్వనున్నారన్నారు. 5 నిమిషాలు ఆలస్యంగా అనగా ఉదయం 9.05 వరకు విద్యార్థులు పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్ టికెట్లను ఇచ్చామని, www.bse.telangana.gov.in వెబ్సైట్ నుండి కూడా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకొనవచ్చును. పరీక్ష కేంద్రాలను ముందుగానే తెలుసుకొని ఒక గంట ముందుగా విద్యార్థులందరూ పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా తెలియజేశారు.
విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేందుకు అన్ని పరీక్ష కేంద్రాలలో కో. టీకాల ఏర్పాటుతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, విద్యార్థులందరూ కూడా వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. ఎలాంటి సందేహాలైనా సరే నిన్పత్తి చేసుకొనుటకు, రంగారెడ్డి జిల్లా విద్యార్థులు 24 గంటలు హెల్ప్ లైన్ 9000646899 ను సంప్రదించవచ్చును. అలాగే వికారాబాద్ జిల్లా విద్యార్థులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని నెంబరుకు 08416 - 235245 ఫోన్ చేయగలరు. పరీక్షా సమయం పూర్తయ్యే పరకు విద్యార్థులు పరీక్షా హాల్ లోనే ఉండాలని, పరీక్ష మధ్యలో బయటకు అకుమంచబడదని తెలిపారు.