- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోసకారి సీఎం కేసీఆర్ : డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
దిశ, పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపిస్తానని ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయని మోసకారి సీఎం కేసీఆర్ అని డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగిలో జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మెకు శనివారం డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి సాధించుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యలే ఈ మూడు దక్కించుకున్నారన్నారు.
జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల ట్రైనింగ్ పిరియడ్ ఇతర రాష్టాల్లో కేవలం ఒక సంవతసరం మాత్రం ఉంటే మన రాష్టంలో మూడేళ్లకు పెంచడమేమిటి అని ప్రశ్నించారు. మూడేళ్లు దాటి నాలుగేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోడం లేదన్నారు. కేవలం శ్రమ దోపిడి చేస్తూ చిరు ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్, నాయకులు లాల్ కృష్ణ ప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ ఎర్రగడ్డపల్లి కృష్ణ, మున్సిపల్ ప్లోర్ లీడర్ జరుపుల శ్రీనివాస్ పవార్, రాంచెంద్రయ్య, బద్రిగారి రాజ్ పుల్లా రెడ్డి, రవి నాయక్ , కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.