బీఆర్ఎస్ లో అవమానాలు తట్టుకోలేక పార్టీని వదిలేస్తున్నాం..

by Sumithra |
బీఆర్ఎస్ లో అవమానాలు తట్టుకోలేక పార్టీని వదిలేస్తున్నాం..
X

దిశ, యాచారం : బీఆర్ఎస్ లో అవమానాలు తట్టుకోలేక పార్టీని వదిలేస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోసుపల్లి వీరేష్ కుమార్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరి గుడా గ్రామంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేష్ కుమార్ మాట్లాడుతూ 2001 నుండి పార్టీని నమ్ముకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. ఇబ్రహీంపట్నం మండల అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యకుడిగా 16 సంవత్సరాలు పని చేశానని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానన్నారు. రాష్ట్రం కోసం ఉద్యమం చేసే సమయంలో తమపై 22 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఉద్యమ నేతలను పూర్తిగా తొక్కేసి అనర్హులకు పదవులు ఇచ్చారని ఎద్దేవాచేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తన దగ్గరున్న నామినేట్ పదవులు కూడా ఉద్యమ నాయకులకు ఇవ్వలేకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీకి తన సేవలను అందిస్తానని మాజీఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో 300 మందితో కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్రహీంపట్నంలో విజయం సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన నేతలు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed