అభివృద్ధి చేశా మరోసారి ఆశీర్వదించండి : సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |   ( Updated:2023-11-09 12:58:22.0  )
అభివృద్ధి చేశా మరోసారి ఆశీర్వదించండి : సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మీర్ పేట్: తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ, అభివృద్ది పథకాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విద్యా శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ పాత గ్రామంలో స్థానిక నాయకులతో మంత్రి కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆలోచించాలని అన్నారు.

గతంలో విద్యుత్ వ్యవస్థ ఎలా ఉండేది, రైతులు ఆనాడు ఎట్లా ఉండే నేడు రైతులు ఎట్లా ఉన్నారని ఇవన్నీటిని గుర్తించి అభివృద్ధి సంక్షేమం ఒక తాటిపై తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ ని, మహేశ్వరం నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా తను చేసిన అభివృద్ధిని చూసి మనస్ఫూర్తిగా ఆలోచించి పెద్ద మనసు తో కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఏం దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు మహిళ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నా

Advertisement

Next Story