ప్రారంభానికి నోచుకోని అర్బన్ పార్క్..!

by Sumithra |
ప్రారంభానికి నోచుకోని అర్బన్ పార్క్..!
X

దిశ, తాండూర్ రూరల్ : తాండూరు నియోజకవర్గంలోనే అత్యంత విశాలవంతమైన అర్బన్ పార్కును రూ కోటి 50 లక్షలతో అభివృద్ధి చేసినప్పటికి ఆచరణలోకి తేక అర్థంతరంగా వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సర్వే నెంబర్ 58 లో గల ఫారెస్ట్ భూమిని అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ ఫార్క్ నిర్మాణం కోసం 110 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించారు.

దీంతో యాత్రికులకు అనుగుణంగా ఉండేందుకు చుట్టూ ప్రహరీ నిర్మాణంతో పాటు యాత్రికులు సేద తీర్చుకునేందుకు కుర్చీలు వాకింగ్ చేసేందుకు రోడ్లు వంటి వాటిని అభివృద్ధి చేయాల్సి ఉండగా అవేమి పట్టించుకోకుండా ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వం విడుదల చేసిన రూ కోటి 50 లక్షల నిధులతో ఫారెస్ట్ భూమికి కంచె నిర్మించి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అర్బన్ పార్కును యాత్రికులకు అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed