- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంషాబాద్‌లో పేలిన ఎలక్ట్రికల్ బైక్.. తప్పిన ప్రమాదం
దిశ,శంషాబాద్ : ఇంటి ముందు పార్కు చేసిన ఎలక్ట్రికల్ బైకులు పొగలు వచ్చి బ్యాటరీ పూర్తిగా దగ్ధమైన ఘటన శంషాబాద్ మండలం నర్కుడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శంషాబాద్ మండలం నర్కుడ గ్రామానికి చెందిన బుర్కుంట సంజీవ గత రెండు నెలల క్రితం గ్రామ శివారులో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ కు షోరూంలో 85 వేలకు ఈగల్ క్లాసిక్ ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశాడు. అయితే ఎప్పటిలాగే గురువారం నర్కుడ స్వగృహ వెంచర్లులోకి అతని దగ్గర పని చేసే నర్సింలు ఎలక్ట్రికల్ బైక్ తీసుకుని వెళ్లి ఇంటి ముందు పార్కు చేసి ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి ఒక్కసారిగా ఎలక్ట్రికల్ బైక్ నుండి పొగలు వచ్చాయి.ఆందోళనకు గురై ఇంటిలో ఉన్న బోరు మోటర్ స్టార్ట్ చేసి పైపుతో నీళ్లు కొట్టాడు. అయినా పగలు ఆగకపోవడంతో మరొకటి సహాయంతో బైక్ నుండి బ్యాటరీ తొలగించి పక్కకు వేశాడు. బ్యాటరీ పెద్ద పెద్ద సౌండ్ రాస్తూ దట్టమైన పొగ వచ్చి పేలిపోయింది అన్నాడు. బైక్ లో పొగలు వచ్చే సమయానికి బైక్ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందన్నారు.
Read More..