- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆదాని, మోడీ బంధం దేశానికే ప్రమాదకరం..
దిశ, ఆమనగల్లు : ఆదాని మోడీ బంధం దేశానికే ప్రమాదకరమని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ, ఆదాని దోస్తీ పాలనలో ఎల్ఐసి, ఎస్బీఐ బ్యాంకుల లూటిలను వ్యతిరేకిస్తూ సోమవారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, పీసీసీ సభ్యులు అయిల్ల శ్రీనివాస్ గౌడ్ హాజరైనారు. ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి, ఎస్బీఐ సంస్థలకు ఆధాని కంపెనీలో పెట్టుబడిలో ఉన్నాయని, ఎల్ఐసీ డిపాజిటర్లు, పాలసీదారులు కలవరానికి గురవుతున్నారన్నారు.
దేశభక్తి మాటున బీజేపీ ప్రభుత్వము దేశానికి ద్రోహం చేస్తుందని, బీజేపీ మోడీ, ఆదానీల స్నేహబంధం ప్రజలకు అర్థమవుతుందని, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్, ఆమనగల్లు బ్లాక్ మండలాల అధ్యక్షులు యాట నర్సింహా, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు బిచ్య నాయక్, ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణ నాయక్, శ్రీశైలం, నాయకులు ఖలీల్, అలీం, రమేష్, మహేష్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.