- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya: రానా టాక్ షో ట్రైలర్ విడుదల.. పెళ్లి పిల్లలపై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా మారాడు. అలాగే టాక్ షోల్లో హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో ఆయన ‘నెంబర్ 1 యారీ’ అనే షోతో మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ‘ది రానా దగ్గుబాటి’(The Rana Daggubati) అనే కొత్త టాక్ షోతో రాబోతున్నాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ షో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.
ఇందులో రానా హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు.. తన స్పిరిట్ మీడియా(Spirit Media)పై నిర్మించారు. తాజాగా, ‘ది రానా దగ్గుబాటి’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఈ షోకు రాబోతున్న గెస్టులను కూడా చూపించేశారు. అయితే ఈ షూట్ ఒకేచోట కాకుండా రకరకాలు ప్లేస్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ షోకు ఆర్జీవీ, రాజమౌళి(Rajamouli), శ్రీలీల, సిద్ధూ జొన్నలగడ్డ, రానా భార్య మిహీకా, నాని, తేజ సజ్జా, దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), రిషబ్ శెట్టి,.. పలువురు స్టార్స్ వచ్చారు.
అలాగే నాగచైతన్య(Naga Chaitanya) కూడా హాజరై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు? అని రానా అడగ్గా.. దీనికి చైతు సమాధానమిస్తూ.. ‘‘సంతోషంగా పెళ్లి చేసుకుని. కొంతమంది పిల్లలను కనాలి’’ అన్నారు. అంటే వెంకీ మామ లాగా నలుగురిని కంటావా అని రానా అనడంతో వామ్మో అలా కాదని బదులిచ్చాడు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.