ఉమ్మడి కొత్తూరులో చక్రం తిప్పిన యువనేత.. మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్

by Sumithra |
ఉమ్మడి కొత్తూరులో చక్రం తిప్పిన యువనేత.. మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్
X

దిశ, నందిగామ : ఏ పార్టీలో పనిచేసిన ఆయన విధేయత, వినయం, ఆయనను ఓ స్ట్రాంగ్ లీడర్ గా గుర్తింపునిచ్చింది. నిత్యం ప్రజలే నా బలం.. బలగమని నమ్మి ప్రజాసేవకుడిగా, అపార రాజకీయ అనుభవంతో తనను నమ్మిన ప్రజల మనసులను గెలుచుకొని నందిగామ మండల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ, అతనే నేటి మేటి లెజెండరీ స్ట్రాంగ్ లీడర్ చేగూరు గ్రామానికి చెందిన మంచన్ పల్లి శివశంకర్ గౌడ్, నందిగామ మండలంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పటిష్టమైన కోటగా తీర్చిదిద్ది ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు.

ఉమ్మడి చేగూరుతో పాటు నాలుగు గ్రామపంచాయతీలో మహా నాయకులు ఉన్న సాహసమే ఊపిరిగా దూకుడు పెంచి కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా.. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించి చేతి గుర్తుకు ఓటు పడేలా పోరాడి వీర్లపల్లి శంకర్ కు విజయం చేకూరడంలో ప్రధాన పాత్ర పోషించారు. శంకరును గెలిపించి రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న ఒకే ఒక నాయకుడిగా శివశంకర్ గౌడ్ ఉమ్మడి మండలంలో ఆయన సేవలు ఆయన పోషించిన పాత్ర సర్వత్ర హార్ట్ టాపిక్ గా మారింది. హోరా హోరిలో అతనే ఓ ఆయుధంలా వంటి చేత్తో చక్రం తిప్పి కాంగ్రెస్ ను గెలిపించిన శివశంకరును మండల ప్రజలందరూ హాట్స్ ఆఫ్ చెబుతున్నారు.

Advertisement

Next Story