మాకు ప్రాణహాని ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజన యువకుడు..

by Sumithra |
మాకు ప్రాణహాని ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజన యువకుడు..
X

దిశ, కొత్తూరు : భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. డబ్బే సంపాదన ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలు బలైన సంఘటనలు ఎన్నోవున్నాయి. సామాన్య ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గిరిజన కుటుంబాల మధ్య ఉన్న భూ తగాదాలో జోక్యం చేసుకోవడమే కాకుండా వారిని కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ ఓ గిరిజన కుటుంబ బాధితులు కొత్తూరు పోలీస్ స్టేషన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కొత్తూరు మండలం మల్లాపూర్ తాండకు చెందిన ఆంగోత్ నరేష్ స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అదే విధంగా సైబరాబాద్ కమిషనర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ రెడ్డి పై ఈ ఫిర్యాదు చేసినట్టు బాధితులు పేర్కొన్నారు. సర్వేనెంబర్ 18లో గల 20 గుంటల భూమి విషయంలో తమ మేనత్త సిద్దాపూర్ తండాకు చెందిన పాత్లవత్ బుజ్జికు రెండు లక్షల 40 వేల రూపాయలకు పొలం రికార్డ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇట్టి డబ్బులు చెల్లించి తిరిగి భూమి తీసుకునేందుకు గత రెండు, మూడు నెలలుగా ప్రయత్నిస్తున్న బుజ్జీ స్పందించలేదని పేర్కొన్నారు. తన తాత లచ్యా నాయక్, తండ్రి మాన్య నాయక్, బాబాయ్, రవీందర్ నాయక్ తదితరులు తన మేనత్తకు డబ్బులు బకాయి ఉన్నారని తెలిపారు.

అయితే తమ భూమి తమకు తిరిగి ఇవ్వకుండా నిర్లక్ష్యం జరుగుతుందని తమకుటుంబ తగాదాలొ మల్లాపూర్ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి జోక్యం చేసుకొని సదరు భూమిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఫిర్యాదులొ పేర్కొన్నారు. అతను తమ భూవివాదాల్లో రావద్దని తమ కుటుంబ సమస్య అని చెప్పగా దానికి కరుణాకర్ రెడ్డి ఒప్పుకోలేదని తెలిపారు. భూమి కొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో కొంతమంది పెద్దలతో కరుణాకర్ రెడ్డి వద్దకు వెళ్లగా అతను కులం పేరుతో దూషిస్తూ చంపుతానని బెదిరించారని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంతకాలంగా తమ భూమిని తామే అనుభవిస్తున్నామని ఇప్పుడు తమ భూమిని అక్రమంగా ఇతరులకు విక్రయించేందుకు సిద్ధపడ్డ వ్యక్తులపై అదేవిధంగా తమను కులం పేరుతో దూషించిన కరుణాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలని కోరారు.

Next Story

Most Viewed