- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదమరిస్తే అనంత లోకాలకు
దిశ, బంట్వారం: వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం ఓగులాపూర్ గేట్ సమీపంలో లో గల కల్వర్టు అతి దారుణంగా మారింది. అటుగా ప్రయాణించేవారు కాస్త ఆదమరిస్తే అనంత లోకాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవ్వుద్ది. కోటపల్లి నుండి తాండూర్ వెళ్లే రోడ్డు ఓగులాపూర్ గేట్ దగ్గర రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ రోడ్డు గుండా రోజు పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తారు. సంబంధింత రోడ్డు రవాణా అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకొని.. వెంటనే కల్వర్ట్ నిర్మాణం చెయ్యాలని వాహన దారులు కోరుతున్నారు. ప్రమాదం జరగకముందే ఈ కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, ఓగులాపూర్, సల్బత్తాపూర్, మారేపల్లి, నాగసముందర్, పెద్దేముల్, అన్న సాగర్, తదితర గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బారికేడ్లు పెట్టి ప్రమాదం జరుగకుండా చూడాలని అన్నారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.