- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హనీమూన్ వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నూతన వధూవరులు సహా నలుగురు మృతి
దిశ, వెబ్ డెస్క్: కేరళలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో నూతన వధూవరులు సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కేరళలోని పతనంతిట్టలో చోటు చేసుకుంది. ఏపీకి చెందిన అయ్యప్ప స్వాములు వెళ్తున్న బస్సును మృతుల కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వధూవరులతో పాటు మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. కాగా మృతులు నూతన వధూవరులు, అను నిఖిల్‌గా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
నూతన వధూవరులు, అను, నిఖిల్‌లు నవంబర్ 30న పూమ్‌కావులోని సెయింట్ మేరీస్ మలంకర చర్చిలో వివాహం చేసుకున్నారు. నిఖిల్ యుకెలో ఉద్యోగం చేస్తుండగా, అను ఎంఎస్‌డబ్ల్యూ చదువు పూర్తి చేసింది. పెళ్లైన రెండు రోజులకే ఈ జంట హనీమూన్ వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా.. వారి కారు వేగంగా బస్సును ఢీకొట్టింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. వారి ఇంటికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఘర్షణ జరిగింది. మాథ్యూ ఈపన్ ముందు ప్యాసింజర్ సీటులో కూర్చుని ఉండగా, బిజు కారు నడుపుతున్నాడు. నిఖిల్, అను వెనుక కూర్చున్నప్పటికీ ప్రమాద తీవ్ర ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న వారు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.