- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో యంగ్ బ్యూటీ..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింట్ వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుండగా.. ఇక ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేశారు. అయితే.. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీలో డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కీ రోల్‌లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కనిపించనున్నట్లు ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఇక యంగ్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది అని తెలియగానే ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ న్యూస్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని, ఈ ముగ్గురిలో ఎవరితోనూ చర్చలు కూడా జరగలేదని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మరి డార్లింగ్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.