- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కుటుంబం అవినీతితో నిండిపోయింది : మాణిక్ రావు ఠాక్రే
దిశ చేవెళ్ల : కేసీఆర్ కుటుంబం అవినీతితో నిండిపోయిందని, ఆయన కూతురు కవిత లిక్కర్ స్కాంలో ఉందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే విమర్శించారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రానికి వచ్చిన ఆయన ఈ నెల 26న చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ జరుగే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబం అవినీతితో నిండి పోయిందని, లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్, హైదారబాద్‌లో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ చేశారన్నారు. ఈ నెల 26న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేయనున్నారని తెలిపారు.