- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రామ్ కే నామ్’ డాక్యుమెంటరీ వివాదం.. ప్రాణ ప్రతిష్ట వేళ అసదుద్దీన్ వివాదాస్పద ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ అసదుద్దీన్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్ సైనిక్‌పురిలోని ఓ కేఫ్‌లో ‘రామ్ కే నామ్’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించడం వివాదానికి కారణమైంది. ఈ డాక్యుమెంటరీ రామ మందిరానికి విరుద్ధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ అడ్డుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. స్క్రీనింగ్ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదంపై అసద్దుద్దీన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఎందుకు ‘రామ్ కే నామ్’ స్క్రీనింగ్‌ను మధ్యలో ఆపి ముగ్గురిని అరెస్ట్ చేశారో రాచకొండ పోలీసులు తనకు సమాధానం చెప్పాలన్నారు. అవార్డు పొందిన డాక్యుమెంటరీని ప్రదర్శించడం నేరమా? అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ ఫేర్ సభ్యులు కూడా జైలుకు వెళ్లాల్సిందే. ఈ డాక్యుమెంటరీని చూడాలంటే పోలీసుల నుంచి ప్రీ స్క్రీనింగ్ సర్టిఫికేట్ పొందాలా.?’ అని ఓవైసీ ఫైర్ అయ్యారు. ఇది చూసిన నెటిజన్లు ‘రజాకర్’ మూవీకి వ్యతిరేకంగా ఎందుకు ప్రొటెస్ట్ చేశావు మరి అంటూ ఫైర్ అవుతున్నారు.