- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెహ్రూ పోకడలను ముందు వ్యతిరేకించిన వ్యక్తి ఆయనే: లక్ష్మణ్
దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగరేస్తున్నామంటే దీనికి శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ త్యాగాల ఫలితమేనని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘం, జన సంఘంతో ముడిపడిన వ్యక్తి దీన్ దయాళ్ అని కొనియాడారు. విదేశీ భావజాలంతో ఉన్న నెహ్రూ పోకడలను వ్యతిరేకించిన వ్యక్తి అని పేర్కొన్నారు. అంత్యోదయ ద్వారా చిట్టచివరి వ్యక్తికీ ఫలాలు అందాలని చెప్పిన వ్యక్తి అని, అందుకే ప్రధాని మోడీ ఆయన సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారన్నారు.
అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత చెన్నైలోని ఒక మీడియా హౌస్‌లో మాట్లాడిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆమెవన్నీ అసందర్భ ప్రేలాపనలని చురకలంటించారు. ఆమె స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పచ్చ కామెర్ల వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆమె తీరు మారిందని విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకల్లోతులో మునిగిన ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బై ద కరప్షన్, ఫర్ ద కరప్షన్, ఆఫ్ ద కరప్షన్ అన్న రీతిలో సాగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమరుల త్యాగాలను అపహస్యం చేస్తూ పాలన సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్థాగత కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి తదితరులు ఉన్నారు.
Also Read..