రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్

by Javid Pasha |
రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్, సభ్యులుగా మోదల పురుషోత్తం, మహేష్ నియామకం అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ మరియు సహకార శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని రైతు, మత్స్య, గొర్రెలు, మేకలు, మహిళా తదితర అన్ని సంఘాలకు దిశానిర్దేశం చేయనున్నారు. సహకార సంఘాల బలోపేతం, దాని ఆవశ్యకతను గుర్తుచేస్తూ రాజేంద్రనగర్ కేంద్రంగా నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహించానున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాల బలోపేతం మీద దృష్టిపెట్టిన నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పగించింది.

రాజావరప్రసాద్..2001 నుండి పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేచేశారు. 2001 నుండి 2007 వరకు షాద్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, 2007 నుండి 2010 యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010 నుండి 2016 వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పనిచేశారు. 2009లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అరెస్టయినప్పుడు పెళ్లి పీటలపై నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు జైలు జీవితం, నిర్బంధాలను ఎదుర్కొన్నారు.

Advertisement

Next Story