- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీష్ రావును కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయాలు రసవతరంగా మారాయి. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటి అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. గత కొంతకాలంగా రాజాసింగ్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయ్. ఈ తరుణంలోనే బిజెపి నేతలు కొంతమంది ఇతర పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం ఉపందుకుంది. ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా తరుణంలోనే మంత్రి హరీష్ రావును బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరుతారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా... అనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం లేనిది ఎన్నికల ముందు ఒక్కసారిగా కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడుతున్నారని ప్రచారం ఊపు అందుకున్న తరుణంలో రాజాసింగ్ బీఆర్ఎస్ మంత్రితో భేటీ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశా
: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిశానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నిధులు లేకపోవడంతో కొంత అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాని అందుకే పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని హరీష్ రావును కోరినట్లు తెలిపారు.