ఈ జిల్లాలకు బ్యాడ్ న్యూస్.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

by Mahesh |   ( Updated:2024-09-02 15:18:22.0  )
ఈ జిల్లాలకు బ్యాడ్ న్యూస్.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. ఇప్పట్లో తగ్గేటట్లు లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురవగా.. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ఎక్కడ చూసిన వరద నీరు కనిపిస్తుంది. అయితే వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరదలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రేపు ఉదయం నుంచి నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. పైన తెలిపిన జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే వర్షాల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. తాజా హెచ్చరికలతో ఆ జిల్లాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed