- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ అలర్ట్: హైదరాబాద్‌కు మరో 5 రోజుల పాటు వర్ష సూచన!
దిశ, సిటీబ్యూరో: మహానగరంలో మరో నాలుగైదు రోజుల పాటు ఎండలు మండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిరుజల్లుల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముండటంతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక్కసారిగా మెయింటనెన్స్ పనులు నిలిచిపోవటం, నాలాల్లో పూడికతీత పనులు ఆశించినంత వేగంగా జరగకపోవటంతో గతంలో చిన్నపాటి వర్షాలు కురిసి నీటిలో మునిగిన ప్రాంతాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
ముఖ్యంగా మరో రెండు రోజుల పాటు ఎండలు దంచికొడుతాయని, ఆ తర్వాత మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించటంతో నగరంలోని లోతట్టు, నాలా పరివాహక, చెరువులకు దిగువన ఉన్న కాలనీలు, బస్తీవాసులకు అకాల వర్షాల భయం పట్టుకుంది. వర్షసూచన రావటంతో తాము అప్రమత్తంగా ఉన్నామంటూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు సమాచారమిస్తున్నా, సహాయక చర్యలు మాట అలా ఉంచితే ముంపు నివారణ సంగతేంటీ అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. నిధులు పుష్కలంగా ఉన్నపుడు పనులను వేగవంతంగా చేపట్టడంలో విఫలమైన అధికారులు ఇప్పుడు ఎస్ఎన్ డీపీ పనులు చేపట్టేందుకు నిధుల కోసం అన్వేషించటం విమర్శలకు తావిస్తుంది.
మధ్యాహ్నాం.. అంతా నిర్మానుష్యం
ప్రస్తుతం మహానగరంలో ఎండలు 40 డిగ్రీలుగా నమోదవుతున్నందున మధ్యాహ్నాం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల మధ్య నిత్యం రద్దీగా కన్పించే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎప్పుడూ రద్దీగా కనిపించే పాతబస్తీ వీధుల్లో సైతం మధ్యాహ్నం రాకపోకలు పలుచబడుతున్నాయి.