మండే ఎండల్లో వాతావరణశాఖ చల్లటి కబురు

by samatah |
మండే ఎండల్లో వాతావరణశాఖ చల్లటి కబురు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణవరకు ఏర్పడి ద్రోని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజల్లో ఆనందం మొదలైంది. ఇప్పటికే రోజు రోజు రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగిపోతుంది. వడగాలులు, భానుడి భగభగలతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు వడదెబ్బ భారినపడి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో వర్ష సూచనతో ప్రజల్లో కాస్త ఆనందం కనిపిస్తోంది.


Advertisement

Next Story

Most Viewed