Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

by Shiva Kumar |
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఒడిశా తీరం వెంట అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారుల వెల్లడించారు. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌‌ను జారీ చేసింది. ఒడిశా తీరం వెంట ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం, మంగళవారం వరకు ఉమ్మడి వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఈదరుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జులై 2 వరకు ఖమ్మం, ఆదిలాబాద్‌, మంచిర్యాల ఆసిఫ్రాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Next Story

Most Viewed