Rain Alert: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజుల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

by Shiva |
Rain Alert: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజుల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ‌డెస్క్: ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్ప పీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉందని వారు పేర్కొన్నారు. ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులుతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్‌, ములుగు, జయశంకర్‌, నల్గొండ, హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్లలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచించింది.

Advertisement

Next Story

Most Viewed