Rahul Gandhi: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్నే మారుస్తరు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-05-05 14:19:11.0  )
Rahul Gandhi: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్నే మారుస్తరు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్నే మారుస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నిర్మల్ కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా, ఎన్డీఏ కూటముల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఒక వైపు రాజ్యాంగాన్ని పరిరక్షించే ఇండియా కూటమి ఉండగా.. మరోవైపు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలనుకుంటున్న ఎన్డీఏ ఉందని అరోపించారు. పొరపాటున మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్నే మారుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రిజర్వేషన్లను కూడా మోడీ సమూలంగా రద్దు చేస్తారని తెలిపారు. పేదల హక్కులు హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ ప్రధాన అజెండా అని తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. దేశ వ్యాప్తంగా మహిళలకు ఆర్ధిక సాయం చేస్తామని అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని.. ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఆలోచిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి గ్రాడ్యుయేట్‌కి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆదివాసీ భూ సమస్యలను సాధ్యైమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కులగణన, ఆర్థిక సర్వే చేస్తామని అన్నారు. సంపన్న వర్గాల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడే ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Read More...

BREAKING: దేశంలో రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

Advertisement

Next Story

Most Viewed