కాసేపట్లో ఎల్బీ స్టేడియంకు రాహుల్, రేవంత్ రెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-07 07:26:33.0  )
కాసేపట్లో ఎల్బీ స్టేడియంకు రాహుల్, రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా భారీ కాన్వాయ్ ఎల్బీ స్టేడియంకు కాసేపటి క్రితం బయలు దేరింది. ఏఐసీసీ అగ్రనేతలు ఇప్పటికే ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒకే కారులో ఎల్బీ స్టేడియానికి వెళ్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఎల్బీ స్టేడియం చేరుకున్నాయి. కాంగ్రెస్ జెండాలు చేతబూని జై కాంగ్రెస్ నినాదాలతో స్టేడియం దద్దరిళ్లుతోంది.

Advertisement

Next Story

Most Viewed