- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7 నెలల్లో R ట్యాక్స్, B ట్యాక్స్, U ట్యాక్స్.. కాంగ్రెస్ సర్కార్‌పై రఘునందన్ రావు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ భృతి రూ.4116 ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నెలకు రూ.4 లక్షలు జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలోనే ఎక్కువగా జీతం తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో గులాబీ రంగు 3 వర్ణాలు (కాంగ్రెస్ పార్టీ జెండా రంగు) అయిందే తప్పా.. పాలనలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు.
7 నెలల పాలనలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ రాజ్యమేలుతోందని.. ఒక్కో మంత్రి ఒక్కో ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చుకోవడానికి రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ప్రతివారం ఢిల్లీకి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కులగణన త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోందన్నారు. త్వరగా లోకల్ బాడీ ఎన్నికల నిర్వహించాలన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా స్కీమ్‌పై పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించామని పేర్కొన్నారు.