- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వప్నలోక్ ప్రమాదంలో క్యూనెట్ పాత్రపై విచారణ జరగాలి
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో క్యూనెట్ సంస్థ పాత్రపై సమగ్ర విచారణ జరగాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ నిఘా పెట్టాలి కోరారు. స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై వరుస ట్వీట్లతో స్పందించిన ఆయన ఈ కాంప్లెక్స్ లో బీఎం5 సంస్థ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనుక క్యూనెట్ ఎంఎల్ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని దీనిపై నిగ్గు చేల్చాలన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తనను కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో ఎవరూ చిక్కుకోవద్దని అలాంటివి మోసపరిత సంస్థలు అని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు. ఈ విషయంలో తన వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. క్యూనెట్ కంపెనీ చట్ట విరుద్ధమైనదని అలాగే ఎంఎల్ఎం కంపెనీలు దాని అనుబంధ సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్ని అన్నారు. భారీ డబ్బులను ఆశచూపి అమాయకులను మోసం చేస్తున్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బహిర్గతం అయిందని ఆరోపించారు. మోసపూరిత క్యూనెట్ పై అనేక కేసులు నమోదు చేసినప్పటికీ ఈడీ ఆస్తులను జప్తు చేసిన ఆ సంస్థ తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత సంస్థల విషయంలో భవన యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక అద్దెకు ఆశపడి ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దని ఎవరికి అద్దెకు ఇస్తున్నామో ముందుగానే నిర్థారించుకోవాలని సూచించారు.